నారప్ప మూవీ రివ్యూ

0
280

థియేటర్స్ ఓపెన్ అవుతాయి అన్న వార్త వినగానే అసలు ఆనందానికి అవధులు లేవు అనుకోండి ! మీతో పాటు మేము కూడా చాల ఆసక్తి గా థియేటర్స్ ఓపెన్ అవటానికి ఎదురు చూస్తూ ఉన్నాం. ఈలోపు OTT లో రెలీజ్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి . చాలా expectations మధ్య రీసెంట్ గా రిలీజ్ అయినా విక్టరీ వెంకటేష్ నటించిన సినిమా ” నారప్ప ” . ఈ మూవీ తమిళ్ రీమేక్ అయినప్పటికీ తెలుగు లో కాస్త డిఫరెంట్ సినిమాలు చేసే వెంకటేష్ నటించటం తో సినిమా అభిమానులు చాలా వెయిట్ చేసారు.

తమిళ్ మూవీ ఇండస్ట్రీ లో experimental మూవీస్ ఇంకా performance కి స్కోప్ ఉండే రోల్స్ సెలెక్ట్ చేసుకోవటం లో హీరో ధనుష్ దిట్ట. మరి అయితే ఈ మూవీ తమిళ్ లో “అసురన్” పేరు తో రిలీజ్ కాగా, ధనుష్ తన యాక్టింగ్ స్కిల్స్ ప్రూవ్ చేసుకుని అవార్డు ని సొంతం చేసుకున్నాడు, మరి తెలుగు లో ఈ మూవీ అదే రేంజ్ లో ఉందా అనేది చూద్దాం.

కథ :

నారప్ప ( వెంకటేష్ ) తన భార్య అయిన సుందరమ్మ ( ప్రియమణి ), ఇద్దరు కొడుకులు మునికన్నా, సినప్ప ఇంకా ఒక కూతురితో ఒక పల్లెటూరిలో ఉంటారు. పెద్ద కొడుకు మునికన్నా ( కార్తీక్ రత్నం ) చాలా ఆవేశ పరుడు , ఊరిలో ఎవరికీ ఏ అన్యాయం జరిగిన ఊరుకోడు, అలాంటిది ఊరిలోని ఒక పెద్ద మనిషి తో గొడవ పడి అలాగే తన తండ్రి అయిన నారప్ప కి జరిగిన అవమానం తట్టుకోలేక ఆ పెద్దాయన మీద చెయ్యి చేసుకుని చావు కొనితెచ్చుకుంటాడు.

పెద్ద కొడుకు మరణించటం తో తల్లి సుందరమ్మ తండ్రి నారప్ప లు కృంగిపోతుంటారు. ఇది చూసి తట్టుకోలేని తన చిన్న కొడుకు శీనప్ప తన అన్న చావుకు కారణం అయినా మనిషిని చంపేస్తాడు. ఎక్కడ తన చిన్న కొడుకుని కూడా చంపేస్తారేమో అని , నారప్ప కుటుంభం తో పాటు కలిసి ఊరు వదిలి వెళ్ళిపోతారు.

ఇంత జరిగిన నారప్ప అసలు తిరుగుబాటు ఎందుకు చెయ్యడు? తన చిన్న కొడుకుని నారప్ప కాపాడుకోగలుగుతాడా అనేదే కథాంశం.

పాజిటివ్ పాయింట్స్ :

ఇంక ఈ మూవీ లోని పాసిటివ్స్ చూద్దాం – వెంకటేష్ నారప్ప క్యారెక్టర్ కి న్యాయం చేసారు. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ లో తన యాక్టింగ్ స్కిల్స్ తో ప్రేక్షకులని మెప్పించారు, అసలు నారప్ప ఇలా ఆవేశాలకు పోకుండా ఎందుకు ఉంటాడు అనే దానికి నారప్ప ఫ్లాష్ బ్యాక్ తో సమాధానం బాగా చెప్పారు, కథ simple ఏ అయిన ఎలివేషన్స్ add చేయటం తో సీన్స్ బాగా పండాయి ముఖ్యం గా క్లైమాక్స్.

నెగటివ్ పాయింట్స్ :

ఇంక నెగేటివ్స్ సంగతి చూద్దాం – మూవీ కి కాస్త length ఎక్కువగా స్లో narration గా అనిపిస్తుంది, ఎంత రీమేక్ అయినంత మాత్రాన ప్రతి సీన్ అలాగే దించేశారు, ఫస్ట్ హాఫ్ అంత గా effective అనిపించదు, ఇంటర్వెల్ లోని ఫైట్ సీన్ అనుకున్నంత రేంజ్ లో ఉండదు, రాయలసీమ యాస అందరు అంతగా పండించలేక పోయారు – కొన్ని సీన్స్ లో యాస తెచ్చిపెటుకునట్లు అనిపిస్తుంది, సినిమాలో చాలా మట్టుకు ఎమోషనల్ సీన్స్ ఎక్కువ గా కనిపిస్తాయి కాకపోతే ఆ సీన్స్ లో పెర్ఫార్మన్స్ ఇంకా కాస్త పండించి ఉండొచ్చు.

మొత్తానికి నారప్ప వెంకటేష్ కోసం చూడొచ్చు ( one-time watch ).

ఫైనల్ వెరిడిక్ట్ :

emotional village drama remade well

రేటింగ్ : 2.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here