తమిళ్ ఫిలిం ఇండస్ట్రీ లో మనం experimental ఫిలిమ్స్ అందులో challenging రొల్స్ వంటివి చూస్తూ ఉంటాం. మరి ఇలాంటి మూవీస్ తీయటం లో ధనుష్ ఎపుడు ముందు ఉంటాడు.
మరి తన ఈ జోనర్ కి భిన్నంగా కాస్త కమర్షియల్ మూవీ ని ప్లాన్ చేసాడు ధనుష్, అదే ” జగామ తందిరం “. OTT రిలీజ్ అయిన ఈ మూవీ విశేషాలు ఏంటో చూద్దాం.
కథ :
తమిళనాడులోని మధురై ప్రాంతంలో గొడవలు, హత్యలతో కాలం వెళ్లదీసే యువకుడు సురులీ (ధనుష్). హత్యలకు పాల్పడుతున్న క్రమంలో అతడి ప్రాణాలు ముప్పు ఏర్పడటంతో ఓ నెల రోజులపాటు
ఎక్కడైనా తలదాచుకోవాలని తన స్నేహితులు సూచిస్తారు. ఆ సమయంలో బ్రిటన్‌లో Refugees ni కాపడే గ్యాంగ్‌స్టర్ శివదాసుకు వ్యతిరేకంగా పనిచేయడానికి కిరాయి గుండాగా లండన్‌కు వెళ్లే
అవకాశం సురులీకి లభిస్తుంది. అక్కడ ఓ సింగర్ అటీలా (ఐశ్వర్య లక్ష్మీ)ను చూసి తొలి పరిచయంలోనే ప్రేమలో పడిపోతాడు.బ్రిటన్‌లో అడుగుపెట్టిన తన బాస్ పీటర్ కోసం సురులీ ఏం చేశాడు.
గ్యాంగ్‌స్టర్‌గా శివదాసును ఎదుర్కోవడానికి పీటర్‌కు ఎలాంటి సలహాలు ఇచ్చారు.
శివదాస్ ఎలాంటి పరిస్థితుల్లో మరణిస్తాడు? శివదాస్ మరణం తర్వాత సురులీ ఎందుకు పశ్చాత్తాపం పడుతాడు. తనని ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన సురులీని అటీలా చంపాలని ఎందుకు కుట్ర
పన్నుతుంది? తన బాస్ పీటర్‌కు సురులీ ఎందుకు ఎదురు తిరగాల్సి వస్తుంది అనేదే ఈ జగమే తంత్రం మూవీ కథ.
పాజిటివ్ పాయింట్స్ :
ఇక పోసిటివ్స్ విషయానికి వస్తే, జోజు జార్జ్ characterization బాగుంటుంది , ధనుష్ బాడీ లో మంచి స్టైల్ ఉన్న విషయం తెలిసిందే మరి ఈ మూవీ కి బాక్గ్రౌండ్ స్కోర్ తన స్టైల్ ని మరింత
ఎలివేట్ చేసింది అనే చెప్పాలి, ఈ మూవీ లోని లొకేషన్స్ మంచి exotic టచ్ తో ఉంటాయి.
నెగటివ్ పాయింట్స్ :
నెగేటివ్స్ కూడా చూసేద్దాం – లాజిక్ లేని స్క్రిప్ట్ తికమక పెట్టేస్తుంది, ధనుష్ మూవీ లో తన క్యారెక్టర్ కి మంచి ఇంపార్టెన్స్ అండ్ మీనింగ్ ఉండేలా జాగ్రత్త పడతాడు అయితే ఈ మూవీ లో
మంచి characterization లేకపోవటం అతి పెద్ద మైనస్ పాయింట్, బోరింగ్ స్క్రీన్ప్లే , కార్తీక్ సుబ్బరాజ్ outdated డైరెక్షన్, ఐశ్వర్య లేక్ష్మి స్క్రీన్ presence ఎఫెక్టివ్ గా లేక పోవటం ,
మూవీ లో ఎమోషన్స్ క్యారీ చెయ్యలేక పోయారు – ఏ మాత్రం ఎమోషనల్ కనెక్టివిటీ ఉండదు.
ఫైనల్ వెరిడిక్ట్ :
ఈ సినిమా ” అతుకుల బోతుకుల తంత్రం ” | Outdated foreign touch masala
రేటింగ్ : 1/5