హసీన్ దిల్ రుబా రివ్యూ

0
300

జుమ్మంది నాదం ( బి.ఆ. రాఘవేంద్ర రావు ) సినిమా ద్వారా తెలుగు తెరపై అరంగేట్రం చేసి, కొంత మంది టాప్ హీరోస్ తో నటించిన Tapse Pannu సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ కి కాస్త గ్యాప్ ఇచ్చి
బాలీవుడ్ లోని ఎక్స్పెరిమెంటల్ సినిమాలకి C / O అడ్రస్ గా మారింది.

Netflix లో ఇటీవల విడుదల అయినా సినిమా ” హసీన్ దిల్ రుబా ” . Tapsee Pannu , vikrant massey ఇంకా harsha vardhan ముఖ్యమైన పాత్రల్లో నటించారు.
ఇక ఈ మూవీ స్టోరీ,పోసిటివ్స్,నెగేటివ్స్ వంటివి చూసేద్దాం .

కథ :

ఒక పెద్ద గ్యాస్ పేలుడు శబ్దం వినిపిస్తుంది తన ఇంట్లో నుంచి రాణి కి అంటే Tapsee కి. ఏమి జరిగిందా అని కంగారు పడుతూ తన ఇంటికి వెళ్లి చూస్తే ఆమె భర్త అయినా Rishabh

అంటే Vikrant మరణించినట్లు తెలుస్తుంది – ఈ సీన్ తో కథ ప్రారంభం అవుతుంది . ఈ కేసు ని పోలీసులు దర్యాప్తు చేయటం ప్రారంభిస్తారు , రాణి కశ్యప్ ను కూడా అనుమానిస్తారు.
అపుడు తాను తన భర్త తో ఎలా పరిచయం అయింది అని మొత్తం కథ ను వివరిస్తూ వస్తుంది .

రాణి కశ్యప్ ఇంకా రిషబ్ కు పెద్దలు కుదిర్చిన వివాహం జరుగుతుంది, రిషబ్ రాణి తో సాన్నిహిత్యంగా ఉండక పోవటం వల్ల రాణి నిరాశ చెందుతుంది.
అదే సమయం లో రిషబ్ కి తమ్ముడి వరుస ఐన Neel అంటే హర్ష వర్ధన్ ఎంట్రీ ఉంటుంది. అనుకోకుండా రాణి నీల్ కి చేరువ అవుతుంది. ఒక రోజు నీల్ చెప్పా పెట్టకుండా అక్కడ నుంచి వెళ్లిపోగా ,
రాణి కి తాను మోసపోయాను అన్న విషయం తెలుస్తుంది. ఇంత జరిగాక తన భర్తకి చెప్పకుండా దాచుకోలేక పోయి అంత చెప్పేస్తుంది. ఇది విన్న తన భర్త రిషబ్ ఎలా స్పందిస్తాడు ?
అసలు రాణి భర్త అయినా రిషబ్ ఎలా మరణిస్తాడు ? అనేదే కథాంశం

విశ్లేషణ :

మొదటి సీన్ తోనే ఆసక్తిని పెంచాడు డైరెక్టర్ Vinil mathew . ఇక సెకండ్ సీన్ నుంచి investigation మొదలవుతుంది. ముఖ్యం గా tapsee కథ చెప్పేటప్పుడు investigation angle లో కన్నా ఎమోషనల్ angle లాగే కనిపిస్తుంది. మధ్యలో కథ అంతా ఒక ఫామిలీ డ్రామా లాగే సాగుతుంది.

భార్య మనసును ఎలా అయినా గెలవాలి అని తపించే భర్త లాగ, అలాగే భార్య మోసం చేసాక ఆమె పై ఉన్న ప్రేమ తట్టుకోలేక కోపం చూపించలేక కృంగిపోయే ఒక ప్రేమికుడిలా Rishabh క్యారెక్టర్ ని బాగా తీర్చిదిద్దారు

లాస్ట్ లో ట్విస్ట్ రెవీల్ అయ్యే టైం కి నతురాలిటీ కోల్పోయి తార స్థాయి త్యాగాన్ని కనబరిచారు, అక్కడే ఫీల్ దెబ్బతినింది.

రాణి కశ్యప్ చేసింది తప్పుగా చూపించగా, భర్త స్థానం లో ఉన్న Rishabh ది కూడా కొంతమేరకు తప్పు ఉంది, కానీ దానిపై ఫోకస్ చెయ్యలేదు డైరెక్టర్

పాజిటివ్ పాయింట్స్ :

రాణి భర్త రిషబ్ characterization బాగుంటుంది
బాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ కూడా కథకు తగట్లు ఉంటుంది
క్లైమాక్స్ కూడా మంచి ట్విస్ట్ తో ముగించారు .

నెగటివ్ పాయింట్స్ :

కథ కు తగట్లు స్టోరీ length ఉండదు అంటే మూవీ duration ఎక్కువ గా అనిపిస్తుంది
కొన్ని సన్నివేశాలు నాటురల్ గా తీసినట్లు అనిపించవు.

పంచ్ లైన్ :

మొత్తానికి ఏ సినిమా Rishabh’s Dilruba Retains Blood అనొచ్చు.

రేటింగ్ : 2/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here