మనిషికీ-అడవికీ అవినాభావ సంబంధం ఉంది. అసలు మనిషి జీవానికి మూలం, ఆశ్రయం అడవులే. కానీ, నాగరికత, అభివృద్ధి పేరుతో కాలగమనంలో అడవులను మానవుడు క్రమక్రమంగా కబళించి వేస్తున్నాడు. దీంతో ప్రకృతి సమతౌల్యం దెబ్బతిని క్రూర జంతువులు జనావాసాల్లోకి సంచరిస్తూ మనుషులపై దాడి చేయటం, క్రూరంగా చంపేయడంలాంటి ఎన్నో ఘటనలు మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. దర్శకుడు వి.మసర్కర్ ఈ అంశాన్ని కథగా తీసుకుని విద్యాబాలన్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం ‘షేర్నీ’. ఇక ఆ మూవీ సంగతులు ఏంటో చూసేద్దాం.
కథ :
విద్యా విన్సెంట్ (విద్యా బాలన్), మధ్యప్రదేశ్‌లోని ఓ అటవీ ప్రాంతానికి కొత్తగా వచ్చిన డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్. వచ్చి రాగానే తనకు ఒక సమస్య ఎదురవుతుంది. ఒక ఆడపులి ఊరిలోకి చొరబడి మనుషులపై దాడి చేసి చంపేస్తుంటుంది. ఈ సమయంలో ఊరి జనాలు బెంబెలెత్తడంతో ఒక వైపున విద్యా తమ సిబ్బందులతో కలిసి ఆ ఆడపులిని పట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెడుతుంది. మరోవైపు ఇదే అదునుగా చూసుకుని ప్రాంతీయ ఎన్నికలు జరుగుతుండటంతో లోకల్ పార్టీ నేతలు ఈ విషయం లో కలగజేసుకుని రాజకీయ లబ్ధి కోసం వాడుకొంటారు. పింటూ అనే ఓ ప్రైవేట్ వేటగాడిని తీసుకువచ్చి ఆ పులిని చంపేయాలని ప్రయత్నిస్తుంటారు. అటు పులిని, ఇటు ఊరి జనాలను కాపాడాలని విద్యా తాపత్రయపడుతూ ఉంటుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితిని విద్యా ఎలా ఒక కొలిక్కి తీసుకొచ్చింది అనేదే కథాంశం.
విశ్లేషణ :
పాజిటివ్ పాయింట్స్ :
ఇంకా ఈ మూవీ లోని పోసిటివ్స్ విషయానికి వస్తే – విద్య బలం characterization బాగుంటుంది – అటు జనాలను ఇటు జంతువులను కాపాడటానికి చూసే సిన్సియర్ అండ్ జెన్యూన్ ఫారెస్ట్
ఆఫీసర్ గా బాగా చేసింది, village ఇంకా అడవి లొకేషన్స్ చాలా natural అండ్ రియలిస్టిక్ గా అనిపించాయి, బయట ప్రపంచం లో మానవుడికి జంతువులకు జరిగే ఘర్షణ ను బాగా చిత్రీకరించారు ,
మనము ఏ రకంగా ఎదిగే తరుణం లో మానవత్వాన్ని కోల్పోతున్నాము అనేదే బాగా కనబరిచారు.
నెగటివ్ పాయింట్స్ :
ఈ మూవీ నెగేటివ్స్ – స్క్రీన్ప్లే అనుకున్నంత ఇంటరెస్టింగ్ గా లేకపోవటం, విద్య బలం మంచి నటి కానీ ఆవిడకి ఈ సినిమా లో performance చేయటానికి అంత గా అవకాశం ఇవ్వలేదు,
narration స్లో గా ఉండటం వల్ల సినిమా కన్నా ఇది ఒక డాక్యుమెంటరీ గా అనిపిస్తుంది.
ఫైనల్ వెరిడిక్ట్ :
Portrays balance of nature going for a toss
రేటింగ్ : 2.25/5